Header Banner

నమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!

  Wed May 14, 2025 08:05        Politics

మాజీ మంత్రి కొడాలి నానిపై వైఎస్సార్‌సీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని అసమర్థుడని.. గుడివాడ ప్రజలను నమ్మించి మోసం చేశారని వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ ఖాసీం (అబూ) ఆరోపించారు. ఎన్నికల తర్వాత కొడాలి నాని ప్రజలను పట్టించుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. అబూ విమర్శించారు. ఈ మేరకు అబూ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడాలి నానిని నమ్మి మోసపోయానని.. కొడాలి నాని ఎన్నికల తర్వాత ఎక్కడున్నారో కూడా తెలియదని, కార్యకర్తల కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు. నందివాడ మండలంలోని బుడమేరు పరిసర ప్రాంతాల ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే కొడాలి నాని పట్టించుకోలేదని అబూ ఆరోపించారు. కొడాలి నాని పనితీరు సరిగా లేదని, ఆయనను నమ్మి మోసపోయానని అబూ చెప్పారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆయన అనుచరులు వరద బాధితులకు అండగా నిలిచారని అబూ ప్రశంసించారు. రాము నిత్యం ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్నారని.. ఎన్నికల తర్వాత రాము పారిపోతారని ప్రచారం చేశారని.. కానీ ఆయనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నానన్నారు.

ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. గతంలో బుడమేరు వరదల సమయంలో అబూ ఈ వీడియోను తయారు చేశారు. ఆ సమయంలో వీడియో బయటకు రాకపోవడంతో మార్చిలో ఆయనకు వైఎస్సార్‌సీపీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్ష పదవి లభించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: ఏపీలో ఇకపై ఆ రూల్స్ పాటించాల్సిందే..! ప్రభుత్వం కీలక ఆదేశాలు..!


రాజకీయాలకే కొత్త అర్థం చెప్పేలా.. గుడివాడ ఎమ్మెల్యే రాము నిత్యం ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్నారన్నారు అబూ. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అమెరికా పారిపోతాడంటే తామంతా నమ్మామని.. తమను తప్పుదోవ పట్టించిన కొడాలి నాని ఎక్కడ ఉన్నారో కూడా తమకు తెలియడం లేదన్నారు.

ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాముపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. అయితే ఈ వీడియో అంశంపై అబూ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.. అక్కడ డాక్టర్ల సూచన మేరకు ఆయన్ను మెరుగైన వైద్యం కోసం ముంబైలోని ప్రముఖ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కీలకమైన హార్ట్ సర్జరీ తర్వాత కోలుకున్న అనంతరం డిశ్చార్జ్ చేశారా.. లేదా అన్నది క్లారిటీ లేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద కొడాలి నానిపై సొంత పార్టీ నేత చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఇది కూడా చదవండిఏపీలో కొత్త ఆర్వోబీ..! ఆ రూట్లోనే.. తీరనున్న దశాబ్ద కల..!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..


 నేడు (14/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #KodaliNani #YSRCP #PoliticalControversy #AndhraPolitics #ViralVideo #SensationalRemarks